Home తాజా వార్తలు రాష్ట్రంలో కొత్తగా 2,278 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,278 కరోనా కేసులు

2278 new covid 19 cases recorded telangana

 

జిహెచ్‌ఎంసిలో 331, జిల్లాల్లో 1947 మందికి వైరస్ నిర్ధారణ
మరో 10 మంది మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 2278 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 331, ఆదిలాబాద్‌లో 25, భద్రాద్రి 80, జగిత్యాల 56, జనగామ 31, భూపాలపల్లి 27, గద్వాల 21, కామారెడ్డి 78, కరీంనగర్ 121, ఖమ్మం 98, ఆసిఫాబాద్ 26,మహబూబ్‌నగర్ 34, మహబూబాబాద్ 76, మంచిర్యాల 43, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 150 , ములుగు 12, నాగర్‌కర్నూల్ 34, నల్గొండ 126,నారాయణపేట్ 22, నిర్మల్ 23, నిజామాబాద్ 89, పెద్దపల్లి 48, సిరిసిల్లా 53, రంగారెడ్డి 184, సంగారెడ్డి 62, సిద్ధిపేట్ 89, సూర్యాపేట్ 82,వికారాబాద్ 23, వనపర్తి 23, వరంగల్ రూరల్ 28,వరంగల్ అర్బన్ లో 91, యాదాద్రిలో మరో 49 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 10 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,54,880కి చేరింది. అయితే వీరిలో 1,06,867 (69శాతం) మంది అసింప్టమాటిక్, 48,013 (31శాతం) మందికి సింప్టమాటిక్‌తో వైరస్ తేలిన ట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 32,005 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 25,050 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 950 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

బాధితుల్లో యువకుల సంఖ్య పెరిగింది
వైరస్ బారిన పడుతున్న యువకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గత వారం రోజుల క్రిందట 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులు 22% మంది వైరస్ బారిన పడగా, ప్రస్తుతం ఆ సంఖ్య 24%నికి పెరిగింది. ఈ మధ్య వయస్సులు జనసమూహాంలో అత్యధికంగా తిరగడం వలనే వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు అంటున్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 950కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 5328, ప్రైవేట్‌లో 6202 బెడ్లు ఖాళీగా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

మంత్రి హరీష్‌రావుకు నెగెటివ్
ఇటీవల కరోనా బారిన పడ్డ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు తాజా రిపోర్టుల్లో కరోనా నెగటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైరస్ సోకినప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.