*పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 3 లక్షల ఎకరాల సాగు
*రూ. 1000 కోట్లతో తాండూరు అభివృద్ధి
*తెలంగాణ ఉద్యమకారులకు పదవులు
*రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
మన తెలంగాణ/తాండూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు.గురువారం తాండూరు పట్టణంలోని ఎంపిటి ఫన్‌క్షన్ హాలులో నిర్వహించిన నియోజక వర్గ స్థాయి టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమాశానికి ఆయన ముఖ్యఅథితిగా పాల్గోన్నారు,ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు పాలమూరు ,రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్రింద జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.ఈ పథకం పనులు చురుకుగా కొనసాగుతున్నాయని అన్నారు.దీంతో జిల్లాలోని పరిగి, వికారాబాద్,తాండూరు ప్రాంతాలు సస్యశ్యామం అవుతాయని అన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకంపై ప్రతిపక్షాలు లేని పోని రాద్దాంతం చేస్తున్నాయని విమర్షించారు.గత 40 సంవత్సరాలుగా జరగని అభివృద్దిని తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిందని అన్నారు.ఇప్పటి వరకు తాండూరు నియోజక వర్గం అభివృద్దికి రూ.1000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.ఈ నిధులతో నియోజక వర్గంలో సిసిరోడ్లు,మురుగుకావలు,మిషన్ కాకతీయ పనులు చేపట్టినట్లు చెప్పారు.అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రాకారం మిషన్ భగీరథ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని త్వరలో ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తామని తెలిపారు.అదే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫి,కళ్యాణ లక్ష్మి,షాధి ముభారక్ పథకం క్రింద లబ్దిదారులకు చెక్కులను అందించినట్లు తెలిపారు.తాండూరు బైపాస్ రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని భూములు కోల్పోయిన రైతులకు పరిహారం డబ్బులను జిల్లా కలెక్టర్‌కు అందించామని చెప్పారు.
అదే విధంగా రైతులకు,పరిశ్రమలకు ప్రజలకు 2018 జనవరి నుండి 24 గంటల విధ్యుత్ అందిస్తున్నామని ఇందులో వ్యవసాయానికి సైతం 24 గంటలు ఉచిత విధ్యుత్ అందిస్తున్నామని చెప్పారు.దేశఁలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.అదే విధంగా తెలంగాణ ఉధ్యమంలో పాల్గోన్న ప్రతి ఉధ్యమకారునికి ప్రభుత్వం ఉన్నత పదవులు అందిస్తుందని అన్నారు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి 2019 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జి,ఎమ్మెల్సి గంగాధర్ గౌడ మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో 520 గురుకుల పాఠశాలలను ప్రారంభించిందని అన్నారు.ఎస్సి,ఎస్టిల కోసం 23 వేల కోట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిందని అన్నారు.జిల్లాల పునర్విభజనతో అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలను కేసిఆర్ నెరవేరుస్తున్నారని అన్నారు.రానున్న ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఐడిసి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి,విధ్యా మౌళిక సదుపాయల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్,జిల్లా పశుగణాభివృద్ది చైర్మన్ గాజీపూర్ నారాయణరెడ్డి,టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు,తాండూరు జడ్పిటిసి రవిగౌడ్,ఎంపిపి కోస్గి లక్ష్మమ్మ,యాలాల ఎంపిపి సాయన్న గౌడ్.పిఎసిఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్,పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్.తాండూరు మండల పార్టీ అధ్యక్షులు రాందాస్,బషీరాబాద్ మండ ల పార్టీ అధ్యక్షులు వెంకటరాంరెడ్డి,తాండూరు పట్టణ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ రావూఫ్,మాజి మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి,మున్సిపల్ కౌన్సిలర్‌లు నర్సిములు,పరిమళ,నీరజాబాల్‌రెడ్డి,జుబేర్ లాల,రజాక్,అబ్దుల్ రవి, టిఆర్‌ఎస్ నాయకులు అనురాధ, విజయదేవి,రఘు,వివిధ గ్రామాల ఎంపి టిసిలు,సర్పంచ్‌లు గ్రామ కమిటి సభ్యులు, రైతు కమిటి కోఆర్డినేటర్‌లు,బూత్ కమికి సభ్యులు కార్యకర్తలు పాల్దోన్నారు.