Home అంతర్జాతీయ వార్తలు నిరుద్యోగ భృతికి 3.86కోట్ల మంది దరఖాస్తు

నిరుద్యోగ భృతికి 3.86కోట్ల మంది దరఖాస్తు

Unemployment

 

వాషింగ్టన్ : అమెరికాలో వరుసగా తొమ్మిదో వారం నిరుద్యోగ భృతి కోసం లక్షలాది అమెరికన్లు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంకా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

గత వారంలో 24 లక్షల మంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని కార్మిక విభాగం గురువారం ప్రకటించింది. ఇక కరోనా మహమ్మారితో లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

24 million americans filed for unemployment benefits