Home జాతీయ వార్తలు భారత్ లో 26.86 కోట్ల డోసుల పంపిణీ

భారత్ లో 26.86 కోట్ల డోసుల పంపిణీ

26.86 Crore Vaccine Doses Distribution In Indiaన్యూఢిల్లీ : కరోనా కట్టడికి భారత్ లో ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. టీకా డ్రైవ్ లో భాగంగా భారత్ లో ఇప్పటి వరకు  6,86,65,914 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. 18-44 మధ్య వయస్సున్న  18,94,803 మందికి తొలి డోసు,  88,017 మందికి సెకండ్‌ డోసు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు..మూడో దశ టీకా డ్రైవ్‌ ప్రారంభమైన నాటి నుంచి 4,93,56,276 మందికి తొలి, మరో 10,58,514 మందికి రెండో డోసు పంపిణీ చేసినట్టు వారు చెప్పారు. నివారం నాటికి టీకా డ్రైవ్‌ 153వ రోజుకు చేరిందని,  ఒకే రోజు 29,64,596 డోసులు పంపిణీ చేశామని వారు పేర్కొన్నారు. ఇందులో 25,81,421 మంది లబ్ధిదారులకు ఫస్ట్ డోసు,  3,83,175 మందికి సెకండ్‌ డోస్‌ అందజేసినట్లు అధికారులు తెలిపారు.