Home ఆదిలాబాద్ పెళ్లి వ్యాను బోల్తా: 26మందికి తీవ్ర గాయాలు

పెళ్లి వ్యాను బోల్తా: 26మందికి తీవ్ర గాయాలు

Road Accident

ఆదిలాబాద్: పెళ్లి వ్యాను బోల్తా పడిన ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడిన సంఘటనా ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల ఘాట్ సమీపంలో జరిగింది. ఇంద్రవెల్లి మండలం సమ్మక్క నుంచి సంతోలి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

26 Injured In Road Accident In Adilabad District