Home జాతీయ వార్తలు ఒకేరోజు 26, 506 పాజిటివ్ కేసులు

ఒకేరోజు 26, 506 పాజిటివ్ కేసులు

26,506 corona positive cases were registered in india

 

న్యూఢిల్లీ: దేశంలో మొదటిసారి ఒకేరోజు 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో శుక్రవారం నాటికి మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,93,802కి పెరిగింది. కరోనా వైరస్ కాటుకు మరో 475 మంది బలికావడంతో దేశంలో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 21,604కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్‌కు గురై వారిలో 4,95, 510 మంది కోలుకోగా 2,76,685 కేసులు ప్రస్తుతం దేశంలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారిలో సుమారు 62.42 శాతం మంది కోలుకున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

గురువారం-శుక్రవారం మధ్య మరణించిన 475 మందిలో మహారాష్ట్రకు చెందిన వారు 219 మంది ఉండగా తమిళనాడులో 65 మంది, ఢిల్లీలో 45 మంది, పశ్చిమ బెంగాల్‌లో 27 మంది, యుపిలో 17 మంది, కర్నాటకలో 16 మంది, గుజరాత్‌లో 15 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది, రాజస్థాన్‌లో 9 మంది, బీహార్‌లో 8 మంది, తెలంగాణలో ఏడుగురు, అస్సంలో ఆరుగురు, హర్యానా, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీరు, పంజాబ్‌లో ఐదుగురు చొప్పున, ఒడిషాలో నలుగురు, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, మేఘాలయాలో ఒకరి చొప్పున మరణించారు.

26,506 corona positive cases were registered in india