Home ఖమ్మం గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..

27 students test positive in wyra gurukulam school

 

ఖమ్మం: జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోన సోకడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు తగ్గుతున్నాయనుకున్నా సమయంలోనే మళ్లీ పెరుగుతున్నాయి. కరోన కేసులు మళ్ళీ నమోదు కావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో విద్యార్థులు 2 రోజులుగా కరోన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్ కొంతమంది విద్యార్థులకు కరోన పరీక్షలు చేయించారు. పాఠశాలల్లో 13 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణైంది. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గురుకులంలోని విద్యార్థులందరికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గురుకుల పాఠశాలకు చేరుకుంటున్నారు.