హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు చనిపోయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు చనిపోయారని, 238 మంది కోలుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,90,916 కరోనా కేసులు నమోదయ్యాయని వారు చెప్పారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,84,849 మంది కోలుకున్నారని, మృతుల సంఖ్య 1,572కు చేరుకుందని అధికారులు వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం 4,495 కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని, ఇందులో 2,487 మంది హోంక్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24గంటల్లో 53 మంది కరోనా బారిన పడ్డారని వారు చెప్పారు. తెలంగాణ ఇప్పటి వరకు 73,79,538 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు. కరోనా కేసుల సంఖ్యలో తెలంగాణ 12వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ (8.85 లక్షలు) మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మహారాష్ట్ర (19.74 లక్షలు) ఉండగా రెండో స్థానంలో కర్నాటక (9.28 లక్షలు) ఉంది. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు స్పష్టం చేశారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని వారు ప్రజలకు సూచిస్తున్నారు.