Home జాతీయ వార్తలు కొత్తగా 8895 కేసులు… 2796 మంది మృతి

కొత్తగా 8895 కేసులు… 2796 మంది మృతి

2796 Dead in Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 8895 కరోనా కేసులు నమోదుకాగా 2796 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 3,46,33,255 చేరుకోగా 4,73,326 మంది చనిపోయారు. కరోనా నుంచి 3,40,60,774 మంది కోలుకోగా ప్రస్తుతం 99,155 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశం వ్యాప్తంగా 138 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కేంద్రం వద్ద 21.13 కోట్ల డోసులు ఉన్నాయని వెల్లడించింది. దేశ ప్రజలకు 127 కోట్ల డోసులు ఇచ్చినట్టు సమాచారం. కేరళ, బిహార్ లాంటి రాష్ట్రాలలో గత మరణాలు వివరాలు ఈ రోజు వెల్లడించడంతో మృతుల సంఖ్య పెరిగింది.