Home అంతర్జాతీయ వార్తలు పోర్చుగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 29 మంది మృతి

పోర్చుగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 29 మంది మృతి

Bus Accident

 

లిస్బన్: పోర్చుగల్ లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్ట్ లతో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 29 మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో 17 మహిళలు ఉండగా ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడులో బస్సులో 55 పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మడైరాలోని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులంతా జర్మనీ దేశానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. 

 

29 Dead in Bus Accident on Portuguese Island