Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిలో తగ్గుముఖం పడుతున్న కరోనా

ఎపిలో తగ్గుముఖం పడుతున్న కరోనా

295 new corona cases registered in APఅమరావతి : ఎపిలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ఈ రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సోమవారం కరోనాతో ఏడుగురు చనిపోయారని వారు వెల్లడించారు. సోమవారం నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,63,872కు పెరిగిందని, ఇప్పటి వరకు కరోనాతో 14,350 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 4,830 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వారు చెప్పారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు.