Friday, April 19, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి మరో ప్రమోషనల్ సాంగ్

- Advertisement -
- Advertisement -

2nd Promotional song to release from RRR in Sep

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. అక్కడ రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ నెలలోనే ఇండియాకు తిరిగి రాబోతున్న చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్‌లో బిజీ కాబోతున్నారు. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. సినిమా విడుదలకు కనీసం నెల రోజుల నుండే పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా సందడి చేసే విధంగా ప్రమోషన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఇక ఇటీవలే ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి దోస్తీ సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యూజిక్ వీడియో ఇద్దరు హీరోలకు సంబంధించిన పాత్రలను పరిచయం చేయడంతో పాటు ఇద్దరి మద్య స్నేహాన్ని చూపించే విధంగా ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరో ప్రమోషనల్ సాంగ్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు.

సెప్టెంబర్‌లో ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం. కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటలో చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా కనిపించబోతున్నారట. మేకింగ్ వీడియో తరహాలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల్లో షూట్ ను ఎలా చేశారనే విషయాన్ని రఫ్‌గా చూపిస్తూ ఈ ప్రమోషనల్ సాంగ్ సాగుతుందట. మరోసారి ఈ పాటతో కీరవాణి అలరించడం ఖాయమంటున్నారు. దోస్తీ సాంగ్ బాధ్యత పూర్తిగా రాజమౌళి తనయుడు కార్తికేయ చూసుకున్నాడు. రెండవ సాంగ్ బాధ్యతలు కూడా ఆయనకే రాజమౌళి అప్పగించారని తెలిసింది.

2nd Promotional song to release from RRR in Sep

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News