Thursday, April 25, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో భారీగా బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో ప్రయాణించిన 11 మంది ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్యాంట్ల లోపలివైపు(లోదుస్తుల్లో) ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పాకెట్లలో బంగారం దాచుకొని తెస్తున్నట్టు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈక్రమంలో 11 మంది ప్రయాణీకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానం డామన్ నుంచి హైదరాబాద్‌లోని చేరుకున్న క్రమంలో ఆ విమానంలో ప్రయాణించిన ఓ 11 మంది ప్రయాణికుల కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది.

వారిని తనిఖీ చేయగా ప్యాంట్ల లోపలి వైపు ప్రత్యేక జేబుల్లాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో దాదాపుగా 3.11 కిలోల బంగారాన్ని 11మంది ప్రయాణీకులు అక్రమంగా రవాణ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు 11 మంది ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విమాన ప్రయాణాలన్నీ దాదాపు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన విమానాల్లోనూ కొంతమంది అక్రమార్కులు బంగారం స్మగ్లింగ్ చేస్తుండటం గమనార్హం.

3.11 kg gold seized in Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News