Home జాతీయ వార్తలు 2050 నాటికి 3.5 కోట్ల వరద బాధితులు

2050 నాటికి 3.5 కోట్ల వరద బాధితులు

flood

 

ముంబయి, కోల్‌కతా నీట మునిగే ప్రమాదం?

న్యూఢిల్లీ : దేశంలో కోస్తాతీరంలో ఏటా వచ్చే వరదలకు లక్షలాదిమంది నిరాశ్రయులవుతుంటారు. 2050 నాటికి వరద బాధితులు 50 లక్షలు ఉంటారని అమెరికా కేంద్రంగా ఉన్న ఏజెన్సీ మొదట తెలిపింది. అయితే, ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటికి దేశంలో మూడున్నర కోట్లమంది వరదలకు గురవుతారని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడైంది. కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాలను తీవ్రంగా అదుపు చేయకపోతే, ముంబయి, నవీ ముంబయి, కోల్‌కతాలలో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోవచ్చని కూడా తెలిపింది.

అమెరికాలోని వాతావరణ పరిశోధన, కమ్యునికేషన్ల సంస్థ క్లైమేట్ సెంట్రల్ రూపొందించిన కొత్త డిజిటల్ ప్రక్రియ ‘కోస్టల్ డెమ్’ చేసిన పరిశోధనలో ఈ సమాచారం వెల్లడైంది. కోస్తా ప్రాంతంలో వరదల బీభత్సం గురించి నాసా షటిల్ రాడార్ టోపోగ్రఫీ మిషన్ (ఎస్‌ఆర్‌టిఎం) వేసిన అంచనాలు తప్పని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనంలో తేలింది. నేచర్ కమ్యునికేషన్స్ పత్రిక ఈ వివరాల్ని ప్రచురించింది.

3.5 crore flood victims by 2050