Saturday, April 20, 2024

ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు

- Advertisement -
- Advertisement -

3.75 lakh Migrant workers returned to Chhattisgarh

 

రాయపూర్ : లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. వీరితో 1,06,928 మంది కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి 78 శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తిరిగి వచ్చారని, మిగిలిన కాలి నడకతోసహా వివిధ రవాణా మార్గాల ద్వారా స్వరాష్ట్రాన్ని చేరుకున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు వివరించారు.

వలస కార్మికులను సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చేందుకు రైళ్లు, బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.16 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. కార్మికులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చేందుకు ఆరోగ్య శాఖకు రూ. 75 కోట్లు, రెవెన్యూ, విపత్తు నివారణ శాఖకు రూ. 18.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 26 లక్షల మందికి పైగా కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించినట్లు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి శివకుమార్ దహరియా వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News