Thursday, April 25, 2024

హైదరాబాద్ లో మూడు ‘కరోనా వైరస్’ అనుమానిత కేసులు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: చైనాను వణికిస్తున్న ప్రాణాంతకరమైన కరోనా వైరస్, మరికొన్ని దేశాలల్లోనూ శరవేగంగా వ్యాపిస్తుండడంతో హై అలర్ట్ ప్రకటించాయి. ఇండియాలోనూ పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పడు హైదరాబాద్ కు కూడా కరోనా వైరస్ వ్యాపించింది. తాజాగా నగరంలో ముగ్గురు వ్యక్తులకు ఈ వైరస్ సోకినట్లు నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ వైరస్ సోకిన పేషంట్లను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన అమర్ నాథ్ రెడ్డి ఆరోగ్యం బాగోలేకపోవడంతో శనివారం రాత్రి ఫీవర్ ఆస్పత్రిని సంప్రదించాడు. దీంతో వైద్యులు కరోనా వైరస్ సంక్రమణపై అనుమానంతో చికిత్స కోసం అతనిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఆదివారం కూడా మరో ఇద్దరు కరోనా వైరస్ బాధితులు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నిర్దారణ కోసం ముగ్గురి నుంచి బ్లడ్ సాంపుల్స్ సేకరించి పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇండియాలోని అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ని అలర్ట్ చేసింది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించాలని అన్ని విమానాశ్రయ అధికారులన ఆదేశించింది. కాగా, కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 80మంది మృతిచెందినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

3 Coronavirus Suspected Cases Found in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News