Wednesday, November 30, 2022

3 కోట్ల మంది ఐటిఆర్ దాఖలు

- Advertisement -

3 cr taxpayers have filed their ITR till dec 3

 

ఆర్థిక మంత్రిత శాఖ వెల్లడి

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ఇప్పటివరకు 3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటిఆర్‌లు) దాఖలు చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా ఐటిఆర్‌ను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను త్వరగా దాఖలు చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. రోజువారీగా దాఖలు చేసిన ఐటిఆర్‌ల సంఖ్య 4 లక్షలు దాటిందని, పొడిగించిన గడువు తేదీ డిసెంబర్ 31 సమీపిస్తున్న కొద్దీ రిటర్న్‌ల దాఖలు మరింత వేగవంతమవుతోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇ-మెయిల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు పంపడంతోపాటు మీడియా ప్రచారాల ద్వారా తమ ఐటి రిటర్న్‌లను గడువు లోగా దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను డిపార్ట్‌మెంట్ ప్రోత్సహిస్తోంది.

2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి వీలైనంత త్వరగా తమ ఐటిఆర్‌ని ఫైల్ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన రిటర్న్‌ల సంఖ్య 3.03 కోట్లకు చేరుకుంది. దీనిలో 58.98 శాతం ఐటిఆర్1 (1.78 కోట్లు), 8 శాతం ఐటిఆర్ 2 (24.42 లక్షలు), 8.7 శాతం ఐటిఆర్3 (26.58 లక్షలు), 23.12 శాతం ఐటిఆర్4 (70.07 లక్షలు) ఉన్నాయి. ఇది కాకుండా 2.14 లక్షల ఐటిఆర్5, 91 వేల ఐటిఆర్6, 15 వేల ఐటిఆర్7 ఫైల్ అయ్యాయి.

3 cr taxpayers have filed their income tax returns till dec 3

Related Articles

- Advertisement -

Latest Articles