Home తాజా వార్తలు నిన్నటితో ముగిసిన అఖిల ప్రియ పోలీస్ కస్టడీ

నిన్నటితో ముగిసిన అఖిల ప్రియ పోలీస్ కస్టడీ

3 days Police custody end of Akhila Priya

 

హైదరాబాద్ : బోయన్ పల్లి కిడ్నాప్ కేసులో పురోగతిలో 11 మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ సోదరుడి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుండగా.. కిడ్నాపర్ల కోసం బెంగళూరు, చెన్నైలో 15 బృందాలతో గాలించి అదుపులోకి తీసుకున్నారు. 11 మంది కిడ్నాపర్లను రహస్య ప్రాంతంలో ఉంచిన నార్త్ జోన్ పోలీసులు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను గురించి గాలిస్తున్నారు. కిడ్నాప్ కేసులో ఏ1 గా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పోలీస్ కస్టడీ నిన్నటితో ముగిసింది. అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్టు పోలీసులు తెలిపారు. ఈరోజు సెలవురోజు మేజిస్ట్రేట్ ఇంటికి అఖిలప్రియను తీసుకెళ్లనున్నారు. అనంతరం మేజిస్ట్రేట్ ఇంటి నుండి చంచలగూడా జైలుకి తరలిస్తారు. అఖిలప్రియకు 14 రోజుల రిమైండ్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

3 days Police custody end of Akhila Priya