Wednesday, April 24, 2024

ఆహారం వికటించి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆహారం వికటించి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో ఘటన

మన తెలంగాణ/వట్‌పల్లి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆహారం వికటించి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక గ్రామాస్థులు తెలిపిన వివారాల ప్రకారం… తల్లి అంత్యక్రియలకు హాజరై వారం రోజుల పాటు ఇంట్లో ఉండి తిరుగు ప్రయాణం అయ్యారు. కుటుంబంలో ఐదుగురు సోమవారం సాయంత్రం రొట్టె తినగా వాంతులు విరేచనాలు చేసుకున్నారు. అంబులెన్సులో జోగిపేట ప్రభుత్వ దవాఖాన కు తరలించగా అక్కడ వైద్య సిబ్బింది అందుబాటులో ఉండక పోవడంతో వారిని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించే క్రమంలో సుశీల(50), చంద్రమౌళి(60) ప్రాణాలు వదిలారు. దాంతో మిగతా ముగ్గురిలో ఆనసూయను బిబిఆర్ దవాఖానకు, శ్రీశైలం, సరితను ఉస్మానియ దవాఖానకు తరలించారు. ఉస్మానియలో చికిత్స పొందుతూ శ్రీశైలం(55) కన్నుముశారు. అదే దవాఖానలో చికిత్స పొందుతున్న అనసుయ పరిస్థితి నిలకడగా ఉంది. మిగత చిన్న పిల్లలు తినకపోవడంతో తినని వారికి ఏమి కాక పోగా ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. గత వారం రోజుల క్రితం మఠం శంకరమ్మ అదే జొన్న రొట్టె తిని మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన తెలుసుకున్న స్థానిక అందోల్ ఎమ్యెల్యే చంటి క్రాంతి కిరణ్ కుటుంబానికి లక్ష చొప్పున రూ. 3 లక్షల చొప్పున వారి బందువులకు చెక్కులను అందజేశారు.

3 died due to food poisoning in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News