Friday, March 29, 2024

ఎసిబి వలలో ముగ్గురు విద్యుత్ అధికారులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ అడిషనల్ ఎఇ బి.క్రిష్ణారావు, ఎఇ శ్రీనివాస్, లైన్‌మెన్ ప్రకాశ్‌లు విద్యుత్ కార్యాలయంలో తీసుకుంటూ సోమవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. భక్తాపూర్‌కు చెందిన బండారి సంతోష్ తన వాటర్ బాటిల్ తయారు చేసే ఫ్యాక్టరీకి సంబంధించి 63 కెవి ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 100 కెవి ట్రాన్స్‌ఫార్మర్ కోరకు లైన్‌మెన్ ప్రకాశ్‌ను సంప్రదించాడు. దీంతో రూ.30వేలు లంచం ఇవ్వాలని, లంచం మొత్తంలో రూ.10వేలు అడిషనల్ ఎఇ క్రిష్ణారావుకు, మరో 10 వేలు ఎఇ శ్రీనివాస్, తనకు రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఫ్యాక్టరీ యజమాని సంతోష్ మొత్తం రూ.20 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.

అనంతరం తనను లంచం అడిగిన అధికారులతో పాటు లైన్‌మెన్‌పై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు బండారి సంతోష్ నుంచి అడిషనల్ ఎఇ రూ.10వేలు, లైన్‌మెన్ రూ.5వేలు, ఎఇ శ్రీనివాస్ ఈనెల 19న రూ.5 వేలు తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకుని, అడిషనల్ ఎఇ, లైన్‌మెన్‌ల చేతులకు, వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముగ్గురు విద్యుత్ ఉద్యోగులకు కరీంనగర్ ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

3 Electrical Officials in ACB Net in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News