Home జాతీయ వార్తలు 40 మంది హల్ చల్… ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ మృతి

40 మంది హల్ చల్… ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ మృతి

murder

 

సూరత్: మూసి ఉన్న ఒక కంపెనీ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై 40 మంది మూకుమ్మడిగా దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అంకళేశ్వర్ నియోజకవర్గంలోని ఉతియాద్ర గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో మూతపడిన శ్రీజి గ్లాస్ కంపెనీ సామాగ్రి రక్షణ కోసం యాజమాన్యం ఆరుగురి సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది. అయితే, మంగళవారం అర్థరాత్రి  40 మంది ఆ కంపెనీ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు.

ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా నలుగురు తీవ్రంగా గాయపడడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా…. మార్గమధ్యలోనే మరో వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన ఆ ముగ్గురిని… పిరాబాయ్ రాబరి(40), గోవాబాయ్ రాబరి(47), దేవ్ బాయ్ రాబరి(60)లుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డవారు.. ఇశ్వర్ రాబరి, మఫత్ రాబరి, జనార్దన్ రాబరిలుగా గుర్తించారు. అంకళేశ్వర్ ఇన్ ఛార్జి పోలీస్ ఇన్స్ స్పెక్టర్ జెజె చౌడ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 3 guards Killed after 40 people attack at closed factory