Home జాతీయ వార్తలు ట్రక్కు కింద పడి ముగ్గురు శివ భక్తులు మృతి

ట్రక్కు కింద పడి ముగ్గురు శివ భక్తులు మృతి

 

హిస్సార్: హిస్సార్-చండీగఢ్ రోడ్డులోని ఓ గ్రామంలో కన్వారియా బృందాన్ని మంగళవారం తెల్లవారు జామున ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారని మంగళవారం పోలీసులు తెలిపారు. శివ భక్తులైన కన్వారియా బృందం ఉత్తరాఖండ్‌లోని గంగోత్రికి వెళ్లి మోటార్ సైకిళ్లపై ఇంటికి తిరిగి వస్తుండగా తెల్లవారు జామున ఒంటి గంటకు ఘటన చోటు చేసుకుంది. బిఛ్‌పరి గ్రామంలోని తమ ఇళ్లకు చేరుకునే లోపే ప్రమాదం జరిగింది. మృతులను రాహుల్(18), రాజ్ సింగ్(28), రోష్టాస్ (21)గా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు డైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు వారు తెలిపారు.

3 Kanwariyas Crushed to Death at Haryana