Home జాతీయ వార్తలు ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

Minibus-Overturned-in-Kanda

శ్రీనగర్: జమ్మూలోని కందా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సుల బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదాస్థలికి చేరుకొని గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోర్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.