Home జోగులాంబ గద్వాల్ ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి

ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి

Accident
జోగులాంబగద్వాల: జిల్లాలోని ఇటిక్యాల మండలం కోదండాపురం గ్రామ శివారు జాతీయ రహదారిపై మంగళవారం అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.వివరాలలోకి వెళితే.. మానవపాడు మండలం చిన్నపోతలపాడు గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు దాదాపు 28 మంది ట్రాక్టర్‌పై గద్వాల జములమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు ఉదయం బయల్దేరారు. ట్రాక్టర్ కోదండాపురం స్టేజి దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడడంతో పార్వతి (40), మల్లికార్జున్ (42), శైలజ (10) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

3 Killed In Tractor Rollover In Itikyal Mandal