Home జాతీయ వార్తలు ఏనుగుల గుంపు దాడి…. ముగ్గురు మృతి

ఏనుగుల గుంపు దాడి…. ముగ్గురు మృతి

 

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకొని ఏనుగుల అటవీ తరలిస్తామని హామీ ఇచ్చారు. గతంలో తమ ఇండ్లు, పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయని అటవీ శాఖ అధికారులకు రైతులు మొరపెట్టుకున్నారు. ఏనుగుల దాడిలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

 

3 Members Dead in Elephant attack in Pippili Forest