Home తాజా వార్తలు నవదంపతుల ఇంట్లో విషాదఛాయలు

నవదంపతుల ఇంట్లో విషాదఛాయలు

3 of a family killed in car accident at vikarabad

 

మూడు కిలో మీటర్ల దూరంలో ప్రవళిక, స్వేత, డ్రైవర్ మృతదేహాలు మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు

మనతెలంగాణ/మర్పల్లి : పెళ్లి సందడితో సంతోషంగా ఉండవలసిన రెండు కుటుంబాలలో ప్రకృతివైపరిత్యమో.. డ్రైవర్ నిర్లక్షమో తెలియదు కానీ వధువు, వరుడు ఇంట్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్న సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని రావులపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థుల, కుటుంబికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి అమృతమ్మదంపతులకు ఇద్దరు కుమార్తెలు రాదమ్మ, స్వేత, కుమారుడు నవాజ్‌రెడ్డిలు ఇందులో రాదమ్మ, స్వేత(శృతి) వివాహాలు జరిగాయి. ఈనెల 26వతేదీన కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట్ మండల కేంద్రానికి చెందిన సుదర్షన్‌రెడ్డి కుమార్తె ప్రవళికతో వివాహాం జరిగింది.

ఆదివారం రోజున ప్రవళిక తల్లి గారింట్లో ఓడి బియ్యం పనిని ముగించుకుని వరుని ఇంటికి బయలు దేరిన పెళ్లికూతరు ప్రవళిక, పెళ్లికుమారుడు నవాజ్‌రెడ్డి, వారి ఇద్దరు అక్కలు రాదమ్మ, స్వేత, అల్లుడు శ్రీశాంత్‌రెడ్డి దూరపు బందువైన తాండూరు మం డలం అంతారం గ్రామానికి చెందిన రాఘవరెడ్డి మొత్తం కారులో ఆరుగురు వ్యక్తులు మోమిన్‌పేట్ గ్రామం నుంచి వరుడి గ్రామం రావులపల్లి వస్తుండగా మొరంగపల్లి రైల్వేగేటు దగ్గర నీరు నిల్వడంతో అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై వయా సిరిపురం గ్రామం మీదుగా వేల్దామని రాగ సిరిపురం వాగు ప్రవహిస్తుండటంతో తిరిగి మొరంగపల్లి మీదుగా వెల్లుతుండగా అప్పటికే తిమ్మాపూర్ వాగు ప్రవహిస్తుండటంతో అక్కడ రోడ్డుపై వాహనాలు కొంతమంది రైతు లు రెండు దిక్కుల నిలిచిపోయారు.

ఇంతలో కారు డ్రైవరు రాఘవేందర్‌రెడ్డి దిగివచ్చి నీటి ఉధృతిని చూసి వాగు నీరు తక్కువగానే వస్తుందని వెల్లిపోదామని కారును ముందుకు పోనివ్వగా పక్కనున్న వారు వెల్లవద్దని, కొంచేం సేపు నిలిచుందామని పేర్కొన్నప్పటికి డ్రైవరు వినిపించుకోక ముందుకు వెళ్లడం, అప్పుడే వాగు ఉధృతి ఎక్కువ మొత్తంలో పెరగడంతో కారు కోట్టుకుపోతుందన్న విషయాన్ని గమనించి కారులో నుంచి వరుడు నవాజ్‌రెడ్డి, దూ కగా అక్క రాదమ్మ పెద్దగా కేకలు వేయడంతో నవాజ్‌రెడ్డి రాదమ్మ చెయ్యి అందించడంతో వీరిద్దరు ప్రాణాలతో బయటపడగా, కారు అప్పటికి పల్టీలు కోడుతూ వాగులో కొట్టుకుపోయింది. మిగతా నలుగురు కోసం గాలింపుచర్యలు చేసినా ఆదివారం రాత్రివరకు వారి జాడ కనిపించలేదు. రాత్రినుంచి సోమవారం పది గంటలవరకు వాగులో గాలించగా కల్వర్టుకు సుమారు మూడు కిలోమీటర్లు దూరంలో మొమిన్‌పేట్ మండటంలోని బార్వాద్ శివారులో వాగులో రాదమ్మ మృతదేహాం, మరో కిలోమీటర్‌దూరంలో పెళ్లికూతురు ప్రవళిక మృతదేహం లభించింది. డ్రైవరు రాఘవేందర్‌రెడ్డి ఈత రావడంతో ఈదుకుంటూ బయట పడినాడు. బాలుడు శ్రీశాంత్‌రెడ్డి, కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు, గ్రామస్థులు తెలిపారు.

3 of a family killed in car accident at vikarabad