ముగ్గురు నారాయణపేట వాసుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతులకు మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం. వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. నాలుగు నెలల క్రితం భార్యా భర్తలిద్దరు కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. శనివారం బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా ప్రమదంలో కూతురు మౌనిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా నరసింహారెడ్డి ఆర్టిసి కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చే నెల రిటైర్మెంట్ పొందాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో నరసింహారెడ్డి స్వగ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది.
వివాహ సంబంధం కోసం వెళ్లి
నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతుతు టెక్సాస్‌లో కుమార్తె వివాహం కుదుర్చుకునేందుకు టెక్సాస్‌కు కారులో వెళ్లగా అక్కడ ప్రమాదం చోటుచేసుకున్నట్టు బంధువులు వివరించారు. ఈ ప్రమాదంలో దంపతులు నరసింహారెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్‌రెడ్డి మృతి చెందారు. కుమార్తె మౌనికకు ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు బంధువులు అక్కడే ఉన్న తానా,ఆట సంఘం సభ్యులను సంప్రదిస్తున్నారు.
నరసింహారెడ్డి హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ప్రమాదంతో నారాయణపేట జిల్లా పెద్ద చింతకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. భారత్‌లో లాక్డౌన్ విధించక ముందు మార్చి నెలలో కూతురు, కుమారుడిని చూసేందుకు తల్లిదండ్రులు మెరికాలోని టెక్సాస్‌కు వెళ్లారు. లాక్డౌన్ విధించడం వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందని బంధవులు వివరించారు.
3 of family from TS dies in US road accident