Home తాజా వార్తలు అంతరించే అంచుల్లో షార్క్ , రేచేపలు

అంతరించే అంచుల్లో షార్క్ , రేచేపలు

Sharkసంరక్షణకు 30 దేశాల సంసిద్ధత

కొన్ని వందలు, వేల సంవత్సరాల పాటు సముద్రంలో మనుగడ సాగించే షార్క్, రే జలచరాల సంతతి ఇప్పుడు అంతరించిపోయే అంచుల్లో ఉంది. మనిషి స్వార్థమే వీటికి హాని కలిగిస్తోంది. షార్కు చేపల పొలుసు ఔషధ ప్రయోజనాలకు వినియోగమవుతుందని చెబుతుంటారు. అంతేకాదు వాటితో మరెన్నో తయారు చేస్తున్నారు. వాణిజ్యపరంగా షార్క్ చేపల పొలుసులకు మంచి గిరాకీ ఉన్నందున వాటిని వేటాడే వారి సంఖ్య పెరిగింది. షార్క్ చేపల భాగాలు కిలో వెయ్యి రూపాయలకు కూడా దొరకడం లేదంటే వాటికి ఎంత గిరాకీ ఉందో తెలుస్తుంది.

ఈపరిస్థితుల్లో 18 రకాల షార్కు చేపల వేటను నియంత్రించ డానికి తగిన నిబంధనలు రూపొందించడానికి వీలుగా 30 దేశాలు సదస్సు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నాయని వైల్డులైప్ కన్సర్వేషన్ సొసైటీకి చెందిన లుకేవార్‌లిక్ జెనీవాలో పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఈ సదస్సు స్విస్ నగరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా కన్వన్షెన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆధ్వర్యంలో నిబంధనలు రూపొందిస్తారు. 18 రకాల షార్కు, రే చేపలను సంరక్షించడం తక్షణ కర్తవ్యంగా ప్రతిపాదించారు. మేకోషార్కు, రే చేపల్లోని గిటార్,నిడ్జి రకాలు ప్రమాదం అంచుల్లో ఉన్నాయని గుర్తించారు.

30 Countries push to protect sharks

సైన్స్ విభాగం