Saturday, April 20, 2024

ఆటోమేషన్‌తో 30 లక్షల ఉద్యోగాలు పోతాయ్

- Advertisement -
- Advertisement -

30 lakh jobs will be lost with Automation

తక్కువ స్కిల్స్ కల్గినవారిపైనే ప్రభావం
నివేదిక వెల్లడి

ముంబై: సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తోంది. 2022 నాటికి దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోని మొత్తం 1.60 కోట్ల మంది ఉద్యోగులకు గాను 30 లక్షల మంది జాబ్‌లను కోల్పోయే అవకాశముంది. దీని వల్ల వార్షికంగా ఇచ్చే వేతనాల్లో 100 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని నివేదిక పేర్కొంది. దేశీయ ఐటి రంగంలో మొత్తం 16 మిలియన్ల (1.6 కోట్లు) ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో 90 లక్షల మంది తక్కువ నైపుణ్య సేవలు, బిపిఒ విభాగంలో ఉన్నవారు ఉన్నారని సాస్కామ్ వెల్లడించింది.

అయితే 2022 సంవత్సరం నాటికి తక్కువ నైపుణ్య సేవలు, బిపిఒలో చేసే దాదాపు 90 లక్షల మందిలో 30 శాతం అంటే 30 లక్షల మందిపై ప్రభావం పడనుంది. రొబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ లేదా ఆర్‌పిఎ ప్రభావం ప్రాథమికంగా వీరిపైనే ఉంటుందని నివేదిక తెలిపింది. దాదాపు 7 లక్షల మంది ఆటోమేషన్‌లో ఉపాధి పొందనున్నారు. మిగతా టెక్నాలజీ అప్‌గ్రేడ్, అప్‌స్కిల్లింగ్ వల్ల అమెరికాలో అత్యంతగా ప్రభావం పడనుందని, 10 జాబ్‌లు కోల్పోవాల్సి వస్తుందని బుధవారం బ్యాంక్ ఆఫ్‌అమెరికా నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ కారణంగా టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఇతర ఐటి సంస్థలు వచ్చే ఏడాది ఆఖరు నాటికి 3 మిలియన్ల ఉద్యోగులను తొలగించవచ్చని నివేదిక వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News