Home అంతర్జాతీయ వార్తలు విద్యార్థుల్ని, స్థానికులను బందీలు చేసిన ఉగ్రవాదులు

విద్యార్థుల్ని, స్థానికులను బందీలు చేసిన ఉగ్రవాదులు

Philippines-Terrorists

మనీలా : ఫిలిప్పీన్స్‌లోని పికావయన్‌ టౌన్‌లో గల ఓ పాఠశాలలో చొరబడి.. విద్యార్థులను, స్థానికులను బందీలుగా చేసుకున్నారు. దాదాపు 300 మంది ఉగ్రవాదులు స్కూల్లోకి చొరబడ్డారని, విద్యార్థులతో పాటు కొందరు స్థానికులను కూడా బందీలుగా చేశారని అధికారులు తెలిపారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్కూల్ ని చుట్టుముట్టారు. కాల్పులు జరిపేందుకు వీల్లేకుండా ఉగ్రవాదులు పిల్లల్ని, స్థానికులని కవచంలా పెట్టుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడించి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులని అధికారులు తెలిపారు. విద్యార్థులను, స్థానికులను సురక్షితంగా విడిపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.