Home జాతీయ వార్తలు కరోనా ఎఫెక్ట్…. 3000 మంది ఖైదీలు విడుదల

కరోనా ఎఫెక్ట్…. 3000 మంది ఖైదీలు విడుదల

ఢిల్లీ: కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్‌ను నిరోధించడానికి 3000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడంతో ఒక్కసారి వైరస్ విజృంభిస్తే ఖైదీలందరికీ వైరస్ సోకే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సుప్రీం కోర్టు అదేశాల ప్రకారం…. ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశమున్న ఖైదీలను పెరోల్‌పై నాలుగు నుంచి ఆరు వారాల పాటు విడుదల చేస్తామని జైళ్లశాఖ డైరెక్టర్ సందీప్ గోయల్ తెలిపారు. విడుదలైన ఖైదీలలో తీవ్రంగా నేరాలు చేసిన వారు, కరుడుగట్టిన తీవ్రవాదులు ఉండరని ఆయన పేర్కొన్నారు. అండర్ ట్రయల్ నేరస్తులను మద్యంతర బెయిల్‌పై మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామన్నారు.

 

3000 Prisoners released in Corona Virus affect