Home జాతీయ వార్తలు దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

30256 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 30,256 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా వెల్ల‌డించారు. కరోనాతో మరో 295 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,34,78,419కి చేరింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా క‌రోనా బారిన పడి 4,45,133మంది చనిపోయారు. గత 24 గంటల్లో 43,938 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.27కోట్ల మంది కోటుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో 3,18,181 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 80.85 కోట్ల‌కు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

30256 New Corona Cases Reported in India