Wednesday, April 24, 2024

3038 కరోనా కొత్త కేసులు: తొమ్మిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో తాజాగా నాలుగో రోజూ మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే మంగళవారం కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,64,740 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 3038 కొత్తకేసులు బయటపడ్డాయి.

దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,29,284 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,179 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు కొవిడ్ నుంచి 4,41,77,204 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్, కేరళలో ఇద్దరు వంతున జమ్ముకశ్మీర్ , మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు వంతున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు.

దీంతో దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5.30,901 కి చేరింది. ఇక ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0. 05 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు ఇప్పటివరకు 22.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపినీ అయినట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News