Home జాతీయ వార్తలు భారత్ లో కొత్తగా 30,773 మందికి కరోనా

భారత్ లో కొత్తగా 30,773 మందికి కరోనా

30773 New Corona Cases Registered In Indiaన్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో  కొత్తగా 30,773 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,48,163కు చేరిందని వారు పేర్కొన్నారు. ఇందులో 3,26,71,167 మంది కరోనా నుంచి కోలుకున్నారని,  కరోనాతో బాధపడుతూ 3,32,158 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు కరోనాతో 4,44,838 మంది చనిపోయారని వారు పేర్కొన్నారు. గత 24 గంటల్లో కొత్తగా 38,945 మంది కోలుకున్నారని, 309 మంది కరోనాతో చనిపోయారని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో 19,325 కేసులు ఒక్క కేరళలో నమోదయ్యాయని, కరోనాతో కేరళలో 143 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. భారత్ లో కరోనా ప్రక్రియ చురుకుగా సాగుతుందని,  ఇప్పటివరకు 80,43,72,331 మందికి కరోనా టీకాలు వేశామని వారు తెలిపారు  శనివారం ఒక్క రోజే 85,42,732 మందికి టీకాలు వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని వారు తేల్చి చెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే బహిరంగ ప్రదేశాలకు రావాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా ఆరు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలను కోరారు.