Tuesday, November 28, 2023

32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ

- Advertisement -
- Advertisement -

asadiddin owaisi

 

ప్రభుత్వానికి లేఖ రాసిన హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి లేఖ రాశారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్ రాలేదు. దీంతో సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, లాక్‌డౌన్, రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మన ముందున్న మార్గం. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీతో కరోనాను కట్టడి చేయవచ్చని వైద్యులు నిరూపిస్తున్నారు. ఈ తరుణంలో కరోనాను జయించిన వాళ్ల ప్లాస్మా కరోనా పేషంట్లకు ఇస్తే కోవిడ్ నయమవుతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. అయితే వీరిలో కొంతమంది ప్లాస్మా ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కలుగజేసుకున్నారు. తానే దగ్గరుండి కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడానని దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కెటిఆర్‌కు లేఖలు రాశారు. వారి పేర్లను జత చేస్తూ ఎంపి అసదుద్దీన్ లేఖను పంపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News