Home తాజా వార్తలు ఆసిఫ్‌నగర్‌లో కార్డన్ సెర్చ్.. 72 మంది అనుమానితుల అరెస్ట్

ఆసిఫ్‌నగర్‌లో కార్డన్ సెర్చ్.. 72 మంది అనుమానితుల అరెస్ట్

Breaking-Newsహైదరాబాద్: నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 72 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 32 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న అనుమానితులలో 32 మంది బిహార్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది.