Friday, March 29, 2024

భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

320 Kg Drugs Seized at Kothapet Fruit Market

మనతెలంగాణ/హైదరాబాద్: పండ్ల మాటున గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు గురువారం పట్టుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు, వారి వద్ద నుంచి 320కిలోల గంజాయి, మహీంద్రా బొలేరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.40,00,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం, బీదర్ జిల్లా, ఔరద్ తాలూక, జాంబాగ్ గ్రామానికి చెందిన మేత్రి రాజ్‌కుమార్ నగరంలోని సరూర్‌నగర్‌లో ఉంటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బీదర్‌కు చెందిన రంగాలాల్ గంజాయి రిసీవర్. ఇద్దరు స్నేహితులు ఒకే జిల్లా కావడంతో ఇద్దరు తరచూ కలుసుకునేవారు. కొత్తపేటలోని ఫ్రూట్ మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి పండ్ల తీసుకుని వచ్చేవాడు. ఈ క్రమంలోనే గంజాయి స్మగ్లింగ్ చేసే రంగలాల్‌తో పరిచయం ఏర్పడింది. ఇతడు వివిధ ప్రాంతాల నుంచి గంజాయి సేకరించి బీదర్‌కు తరలిస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ నుంచి పండ్ల లోడ్‌తో రాజమండ్రికి వెళ్లాడు. రాత్రి పండ్లను అన్‌లోడ్ చేసి అక్కడే ఉన్నాడు.

అంతకుముందే రంగాలాల్, రాజ్‌కుమార్‌ను కలిసి గోకవరం నుంచి గంజాయి తీసుకుని రావాలని చెప్పాడు. వచ్చే డబ్బులు ఇద్దరం కిలిసి పంచుకుందామని చెప్పాడు. పండ్లను అన్‌లోడ్ చేసిన తర్వాత అక్కడే ఉండి రంగాలాల్ చెప్పినట్లు గోకవరం మారుమూల ప్రాంతానికి వెళ్లి 152 ప్యాకెట్ల గంజాయిని తీసుకుని నగరానికి బయలుదేరాడు. రంగాలాల్ ఆర్టీసి బస్సులో వస్తు డ్రైవర్‌కు సూచనలు ఇచ్చేవాడు. గంజాయిని తీసుకుని వాహనంలో వస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు కొత్తపేట పండ్ల మార్కెట్ సమీపంలో నిందితుడు గంజాయి తీసుకుని వస్తు పట్టుబడ్డాడు. నిందితులు రూ.6వేలకు కిలో కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి రూ.10,000 విక్రయిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు సీతారాం, నవీన్, వెంకటేశ్వర్లు, పి. వెంకటేశ్వర్లు, మన్మథ్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

320 Kg Drugs Seized at Kothapet Fruit Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News