Home జాతీయ వార్తలు కేరళలో ప్రకృతి విలయ తాండవం:324మంది మృతి

కేరళలో ప్రకృతి విలయ తాండవం:324మంది మృతి

324 people Dead in Kerala Flood

తిరువనంతపురం:  కేరళలో  ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. గడిచిన తొమ్మిది రోజుల్లో ప్రాణ నష్టం 324కు చేరినట్లు కేరళ సిఎం పినరయి విజయన్ ప్రకటించారు. అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై తాజాగా అప్రమత్తత ప్రకటిస్తూ నివేదిక విడుదల చేశారు. ప్రకృతి విలయ తాండవంలో దాదాపుగా 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 100 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత పెద్ద విపత్తు ఇప్పుడు సంభవించిందని ఆయన అన్నారు. 80 డ్యాములు తెరిచామని, 324 మంది చనిపోయినట్లు వెల్లడించారు. 1500లకు పైగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 2,23,139 మంది ఆవాసం పొందుతున్నారు’ అని  ప్రధాని మోఢీకి వివరించినట్లు సిఎం విజయన్‌ తెలిపారు.