Tuesday, April 16, 2024

ఇళ్లపై యమపాశాలు..నిత్యం భయం భయం

- Advertisement -
- Advertisement -

మంచాల: మండల పరిధిలోని నోముల గ్రామంలోని 5వ వార్డులో అతి తక్కువ ఎత్తులో 33కేవీ విద్యుత్ తీగలు వేలాడుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లైన్లు ఏకంగా బిల్డింగ్‌ల మీదుగా, మరికొన్ని ఇళ్లకు దగ్గరగా ఉండడంతో ఈ ఇళ్ల యజమానులు నిత్యం భయం భయంగా ఉంటున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కడ ఇంటి మీదకి వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుంటారో అని హడలిపోతున్నారు.

రైతులు పండించిన పంటలను మేడలపై ఆరబెట్టుకోవాలన్నా భయపడుతున్నారు. వైర్లను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గ్రామాలలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదం పొంచి ఉంది….పల్లాటి రాజు
ఇంటిపై వేలాడుతున్న విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉందని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. విద్యుత్ తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. విద్యుత్ స్తంబాలను ఉన్నచోట నుంచి మార్చి పెద్ద పోల్స్ వేసి వైర్లు పైకి లాగాలి.
విద్యుత్ తీగలను తొలగించాలి….దుబ్బాక స్వామి గౌడ్
నెల నెలా విద్యుత్ బిల్లులును వసూలు చేయడంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలను తొలగించడంలో లేదు. 33 కేవీ విద్యుత్ తీగలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News