Home తాజా వార్తలు పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ప్రజలు…

పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ప్రజలు…

People participating

వరంగల్ రూరల్: ఉగాది పండుగను పురస్కరించుకొని చెన్నారావ్ పేట మండల కేంద్రంలోని సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు పంచాంగ శ్రవణం నిర్వహించారు.పండుగలలో ముందుగా వచ్చే పండుగా ఉగాది కావున నూతన సంవత్సరంలో రైతులు, వ్యాపారులు, అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఉగాది పండుగ రోజున ఉదయం పూటనే స్నానం ఆచరించి బెల్లం, కొత్త చింతపండు, వేపపూవు, మామిడికాయ, ఉప్పు తో కూడిన ఆరు రుచులతో పచ్చడి తయరు చేసి కుటుంబ సమేతంగా స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది . ఆరు రుచులతో తయారు చేసిన పచ్చడిని స్వీకరించడం వలన రోగాలు దరిచేరవని పెద్దలు చెపుతున్నారు.

ఉగాది పచ్చడి పంపిణీ  చేసిన బాల్నే వెంకన్నగౌడ్…. ఉగాది పండుగను పూరస్కరించుకుని మండలంలోని అమీనాబాద్ గ్రామంలో టిఅర్‌ఎస్ పార్టీ మండల అదికార ప్రతినిది బాల్నే వెంకన్నగౌడ్ అద్వర్యంలో ఉగాది పచ్చడిని గ్రామప్రజలకు పంపిణి చేశారు.ఈకార్యక్రమంలో ఎంపిటిసి అమ్మసుమలత రాజేష్, మురహరి రవి, కొండపల్లి ప్రదీప్‌కుమార్ తో పాటు పలువురు పాల్గోన్నారు.