Home తాజా వార్తలు రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు

336 new corona cases in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 336 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,62,202కు పెరిగింది. తాజాగా 306 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,53,022 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,898కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.61 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం 76,481 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.