Home అంతర్జాతీయ వార్తలు అఫ్గాన్‌లో కారు బాంబు పేలి 34 మంది మృతి

అఫ్గాన్‌లో కారు బాంబు పేలి 34 మంది మృతి

రంజాన్ మాసంలో మరో దారుణం 

car-bombకాబూల్: అఫ్గాన్‌లోని లష్కర్ గాహ్ నగరంలో గురువారం నాడు శక్తి వంతమైన కారు బాంబ్ ఒక బ్యాంకు వద్ద పేలిన ఘటనలో 34 మంది మరణించారు. బ్యాంకు వద్ద వేతనాలు తీసుకోడానికి నగర వాసులు క్యూలు కట్టిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ పాశవిక బాంబు దాడిజరగడం ముస్లింలను తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. గాయపడిన మరి 60 మందిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన జరిగిన న్యూ కాబూల్ బ్యాంక్ వద్ద వాహనాలు చిన్నాభిన్నమై, చెల్లాచెదరై దృశ్యం గందరగోళంగా తయారైంది. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ తమదే బాధ్యత అని చాటుకోలేదు. అయితే ఇది తాలిబన్ పనేఅని అధికార్లు అనుమాని స్తున్నారు. రంజాన్‌లో కాల్పుల విరమణకు ప్రభు త్వం పిలుపు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల తాలిబన్ ఇటీవల కాలంలో దాడులు జరిపింది. మృతులలో చాలా మంది పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.