Saturday, April 20, 2024

ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా…. 34 మంది క్వారంటైన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ కంపెనీలో సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్న వ్యక్తికి తండ్రి నుంచి  కరోనా వైరస్ సోకింది. సెక్యూరిటీ గార్డ్‌కు పాజిటీవ్ వచ్చిన విషయాన్ని యాజమాన్యం దాటిపెట్టడంతో కంపెనీలో ఉద్యోగులు అడిగితే వారిని బెదిరించినట్టు సమాచారం. జిహెచ్‌ఎంసి అధికారులు 34 మందిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్‌కు తరలించారు. రామంతాపూర్ వాసులు కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత దేశంలో ఇప్పటి వరకు  కరోనా వైరస్ 31,481 మందికి సోకగా 1008 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1009కి చేరుకోగా 25 మంది చనిపోయారు. ఎపిలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉంది. ఎపిలో కరోనా రోగుల సంఖ్య 1332కు చేరుకోగా 31 మంది మరణించారు.

 

రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలు
బాధితులు
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
9,318 7,530 1,388 400
గుజరాత్
3,774 3,159 434 181
ఢిల్లీ
3,314 2,182 1,078 54
మధ్య ప్రదేశ్ 2,387 1,894 373 120
రాజస్థాన్ 2,383 1,550 781 52
తమిళనాడు
2,058 905 1,128 25
ఉత్తర ప్రదేశ్
2,053 1,557 462 34
ఆంధ్రప్రదేశ్
1,332 1,014 287 31
తెలంగాణ
1,009 610 374 25
పశ్చిమ బెంగాల్ 725 584 119 22
జమ్ము కశ్మీర్ 565 381 176 8
కర్నాటక
523 296 207 20
కేరళ 486 123 359 4
బిహార్
366 300 64 2
పంజాబ్
342 222 101 19
హర్యానా
308 81 224 3
ఒడిశా
119 80 38 1
ఝార్ఖండ్ 105 83 19 3
ఛండీగఢ్
56 39 17
ఉత్తరాఖండ్
54 20 34
హిమాచల్ ప్రదేశ్ 40 13 25 2
అస్సాం
38 10 27 1
ఛత్తీస్ గఢ్ 38 4 34
అండమాన్ నికోబార్ దీవులు 33 18 15
లడఖ్
22 6 16
మేఘాలయ 12 11 1
పుదుచ్చేరీ
8 3 5
గోవా
7 7
మణిపూర్ 2 2
త్రిపుర
2 2
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరం
1 1
మొత్తం 31,481 22,676 7,797 1,008

 

34 Uppal Heritage employees quarantine in Medchal

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News