Home జాతీయ వార్తలు భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

34403 new corona cases were registered in Indiaన్యూఢిల్లీ : గడిచిన ఒక్కరోజులో భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. భారత్ లో నాలుగు రోజుల పాటు తగ్గిన కరోనా కేసులు గడిచిన ఒక్క రోజు మళ్లీ పెరిగాయి. గడిచిన ఒక్కరోజులో భారత్ లో కొత్తగా 34,403 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరిందని, మొత్తం కేసుల్లో 3,49,056 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వారు వెల్లడించారు. ఇప్పటివరకు 3,25,98,424 మంది కరోనా నుంచి కోలుకున్నారని, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 37,950 మంది కరోనా  నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు భారత్ లో 77.24 కోట్ల మందికి టీకాలు వేసినట్టు వారు చెప్పారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా ఆరు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు దరించాలని అధికారులు ప్రజలను కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు ప్రజలకు సూచించారు. కేంద్ర  ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు ప్రజలను హెచ్చరించారు.