Friday, March 29, 2024

15 సార్లు టెస్టు చేసిన పాజిటివే….

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ వ్యక్తికి 15 సార్లు టెస్టు చేసిన కరోనా పాజిటివ్ రావడంతో గత మూడు నెలల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మక్సూద్ ఖాన్ (35) కు క్యాన్సర్ బారిన పడడంతో టాటా మెమోరియల్ సెంటర్‌లో కీమోథెరపీ తీసుకుంటున్నాడు. అతడికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో ఎన్‌ఎస్‌సిఐ కోవిడ్19 సెంటర్‌కు తరలించారు. అతడితో పాటు 250 మంది క్యాన్సర్ రోగులు అదే కోవిడ్19 కేర్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కొందరు క్యాన్సర్ రోగులు 15 రోజుల తరువాత టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో ఇంటికి తరలించారు.

కానీ ముగ్గురికి మాత్రం మూడు సార్లు టెస్టు చేసిన పాజిటివ్ వచ్చింది. నాల్గో సారి టెస్టు చేస్తే నెగిటివ్ వచ్చింది. కానీ మక్సూద్ ఖాన్ మాత్రం గత మూడు నెలల నుంచి 15 సార్లు టెస్టు చేసిన పాజిటివ్ వచ్చింది. గత మూడు నెలల నుంచి ఆస్పత్రిలో ఉండలేక ఖాన్ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆస్పత్రి వర్గాలు మాత్రం అతడిని బయటకు పంపించడం లేదు. అతడి ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు ఉంటారని వాళ్లకు అతడితో కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడికి మాత్రం దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. క్యాన్సర్‌కు ఉపయోగించిన మందుల వలనే శరీరంలో వైరస్ అలాగే ఉందని, అందుకే పాజిటివ్ వచ్చే అవకాశం ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News