Home తాజా వార్తలు హైదరాబాద్ 3 కమిషనరేట్లలో మాస్క్‌లు లేని కేసులు 3,500

హైదరాబాద్ 3 కమిషనరేట్లలో మాస్క్‌లు లేని కేసులు 3,500

3500 cases without masks in 3 commissionerates

 

మనతెలంగాణ/సిటిబ్యూరో: కరోనా వైరస్ విస్కృతంగా వ్యాపిస్తుండడంతో పోలీసులు మాస్కులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతున్న వారికి జరిమానా లు విధించారు. ఇప్పటి వరకు మూడు పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు 3,500మందికి రూ.1,000 జరిమానా విధించారు. మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాతో పాటు కేసులు నమోదు చేశారు. మాస్కులు పెట్టుకోని వారికి నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. నోటీసులు వచ్చినవారు కోర్టుకు రావాల్సి ఉంటుం దని వారికి సమాచారం ఇస్తున్నారు. మాస్కు నిబంధన కఠినంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సిఎస్ సోమేష్ కుమార్ ముగ్గు పోలీస్ కమిషనర్లను ఆదేశించడంతో పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.

రోజు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని మాస్కు లేకుం డా తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకుని బయటికి రావాలని కోరుతున్నారు. బంజారాహిల్స్ పోలీసులు రోడ్లపై ప్రత్యేకంగా మాస్కుల కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాస్కులు లేని వారికి ఇన్స్‌స్పెక్టర్ జరిమానా విధిస్తున్నారు. మాస్కుపై అవగాహన కల్పిస్తున్నారు, గేటెడ్ కమ్యూనిటీల్లో కానిస్టేబుళ్లు వెళ్లి మాస్కు, గుంపులుగా ఉండ డం, పండగలు ఒక్కవద్ద చేసుకోవడం తదితర వాటి పై అవగాహన కల్పించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించవద్దని, రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వారికి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవస రం ఉంటేనే బయటికి రావాలని ప్రజలకు చెబుతున్నారు.

షాపింగ్స్ వద్ద ప్రత్యేక నిఘా…
పోలీసులు షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘాపెట్టారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయటికి వచ్చిన ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. కరోనా నిబంధనలు పాటించకుంటే షాపుల యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో మాదిరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా రవాణాలో వెళ్లే వారు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని చెబుతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా మాస్కులు పెట్టుకోవాలని, బంజారాహిల్స్ పోలీసులు అవగాహన కల్పించారు. మాస్కు, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వ్యాపించకుండా చేయవచ్చని పోలీసులు స్థానికులకు చెప్పారు.

3500 cases without masks in 3 commissionerates