Home Default భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో తగ్గిన కరోనా కేసులు

35342 new corona cases registered in Indiaఢిల్లీ : గడిచిన ఒక్క రోజులో భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన ఒక్కరోజులో భారత్ లో కొత్తగా  35,342 మందికి క‌రోనా సోకిందని కేంద్ర వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. గడిచిన ఒక్క రోజులో 38,740 మంది కరోనా  నుంచి కోలుకున్నారని, కరోనాతో 483 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. భారత్ లో  ఇప్ప‌టి వ‌ర‌కు  3,12,93,062 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం 4,05,513 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనాతో 4,19,470 మంది చనిపోయారని వారు వివరించారు. భారత్ లో టీకా డ్రైవ్ చురుకుగా సాగుతుందని, ఇప్ప‌టి వ‌ర‌కు 42,34,17,030 మందికి కరోనా టీకాలు వేసినట్టు వారు వెల్లడించారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా అరు అడుగుల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలను హెచ్చరించారు.