Home జాతీయ వార్తలు భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

35662 new corona cases registered in Indiaన్యూఢిల్లీ : భారత్ లో గడిచిన ఒక్కరోజులో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం నాడు శుక్రవారం 34 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.  గడిచిన ఒక్కరోజులో  అవి 35 వేలు దాటాయి. దీంతో శుక్రవారం  కంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ఉదయం తెలిపారు. గడిచిన ఒక్కరోజులో భారత్ కొత్తగా 35,662 కరోనా కేసులు నమోదయ్యాయని,  దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరిందని వారు వెల్లడించారు. ఇందులో 3,40,639 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, ఇప్పటివరకు 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారుు పేర్కొన్నారు.  గడిచిన ఒక్కరోజులో కొత్తగా 33,798 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని వారు తెలిపారు. భారత్ లో టీకా ప్రక్రియ చురుకుగా సాగుతోంది. శుక్రవారం భారత్ లో 2.5 కోట్ల మందికి టీకాలు వేశామని, దీంతో ఇప్పటివరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్‌ తుడిపివేసిందని వారు పేర్కొన్నారు. గడిచిన ఒక్కరోజులో బారత్ లో 2.5 కోట్ల మందికి టీకాలు వేశామని వారు పేర్కొన్నారు. భారత్ లో సెప్టెంబర్‌ 17 వరకు 55,07,80,273 మందికి కరోనా పరీక్షలు చేశామని, శుక్రవారం ఒక్కరోజే 14,48,833 మందికి పరీక్షలు చేశామని అధికారులు స్పష్టం చేశారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అదికారులు తేల్చిచెప్పారు.