Home జాతీయ వార్తలు భారత్ లో కాసింత తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కాసింత తగ్గిన కరోనా కేసులు

357229 New Corona Cases Registered In Indiaన్యూఢిల్లీ : భారత్ లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు కాసింత తగ్గాయి.  భారత్ లో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్ల మార్క్ ను దాటడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,57,229 మంది కరోనా బారినపడినట్టు కేంద్రం కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు మంగళవారం ఉదయం మీడియాకు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 3,20,289 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 3,449 మంది కరోనాతో బాధపడుతూ చనిపోయారని అధికారులు వెల్లడించారు.  కొత్తగా నమోదైన కేసులతో భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,82,833కు పెరిగిందని, ఇప్పటి వరకు 1,66,13,292 మంది కరోనా నుంచి  కోలుకున్నారని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు  2,22,408 మంది కరోనాతో చనిపోయారని, ప్రస్తుతం భారత్ లో 34,47,133 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వారు పేర్కొన్నారు.  ఇప్పటి వరకు  15,89,32,921 మందికి టీకాలు వేసినట్టు వారు వెల్లడించారు.  సోమవారం ఒక్కరోజే  16,63,742 మందికి కరోనా పరీక్షలు చేశామని, దీంతో ఇప్పటివరకు వరకు 29.33 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమన్న విషయం ప్రజలు గ్రహించాలని అధికారులు తేల్చిచెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు దరించాలని వారు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలను హెచ్చరించారు.