Home జాతీయ వార్తలు బ‌క్రీద్ : విధుల‌కు హాజ‌రుకాని 36 మంది పోలీసుల‌ు స‌స్పెండ్

బ‌క్రీద్ : విధుల‌కు హాజ‌రుకాని 36 మంది పోలీసుల‌ు స‌స్పెండ్

36 Police Men Suspended In Delhiఢిల్లీ : బక్రీద్ విధులకు హాజరు కాని 36 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్టు నార్త్ వెస్ట్ డిసిపి వైజయంత ఆర్య తెలిపారు. శనివారం ఉదయం ఐదు గంటలకు విధులకు రాని వీరిపై చర్యలు తీసుకున్నట్టు డిసిపి వెల్లడించారు. కరోనా కారణంగా బక్రీద్ పండుగ వేళ ముస్లిం సోదరులు సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విధులకు హాజరు కాని 36 మందిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు డిసిపి చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిస్తే కఠిన చర్యలు తప్పవని డిసిపి పోలీసులను హెచ్చరించారు. కరోనా కట్టడిలో పోలీసులు అంకితభావంతో పని చేయాలని డిసిపి సూచించారు.